మోహ‌న్‌లాల్‌తో సూర్య‌

  • IndiaGlitz, [Friday,May 11 2018]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్, జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర చిత్రాల్లో కూడా వీలును బ‌ట్టి న‌టిస్తుంటారు. రీసెంట్ టైమ్‌లో ఆయ‌న తెలుగులో జ‌న‌తాగ్యారేజ్‌, మ‌నమంతా సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు త‌మిళంలో హీరో సూర్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో మోహ‌న్‌లాల్ న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సూర్య ఎన్‌.జి.కె అనే సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు.