సందీప్ కు సూర్య సపోర్ట్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ప్రస్తుతం నా పేరు శివ ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో సందీప్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను జూన్ 12న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను హీరో సూర్య విడుదల చేస్తున్నాడట. ఈ విషయాన్ని సందీప్ తెలియజేశాడు. సందీప్ కిషన్ నక్షత్రం విడుదలకు సిద్దమవుతుండగా, మంజుల దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ, కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఓ సినిమా, కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ బై లింగ్వువల్లో సందీప్ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com