Kanguva:యోధుడిగా డిఫరెంట్ లుక్‌లో సూర్య.. ‘‘కంగువా’’ గ్లింప్స్ చూశారా, అర్ధరాత్రి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యతనిస్తారు తమిళ స్టార్ హీరో సూర్య. హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. తాజాగా సూర్య నటిస్తున్న చిత్రం ‘‘కంగువా’’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, లుక్ ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ.. జూలై 23వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు కంగువా గ్లింప్స్‌ను విడుదల చేశారు. గుట్టలు గుట్టలుగా వున్న శవాలపై నుంచి సూర్య ఎంట్రీ ఇస్తారు సూర్య. బ్యాక్‌గ్రౌండ్‌లో అఖిలాండం ఏలిన మారాక్రుని వంశకుడు అంటూ సాంగ్ ప్లే అవుతుంది. చివరిలో కుశలమా అంటూ తన ఫేస్‌ను రివీల్ చేస్తారు సూర్య. తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రలో సూర్య నటిస్తున్నారు. కంగువ అంటే అగ్ని శక్తి వున్న వ్యక్తి , శక్తివంతుడు అని అర్ధం.
రూ.300 కోట్ల బడ్జెట్.. 10 భాషల్లో సినిమా :
ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. యోగి బాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సరళ, ఆనంద రాజ్, కేఎస్ రవికుమార్, జగపతి బాబు, నటరాజ్ సుబ్రమణ్యం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రీడితో దాదాపు పది భాషల్లో కంగువాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కోలీవుడ్ టాక్.
సూర్య-శివ కాంబినేషన్‌పై భారీ అంచనాలు :
పునర్జన్మల నేపథ్యంలో కంగువా వుంటుందని.. రెండు పార్ట్‌లుగా సినిమా తెరకెక్కుతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడు శివ ఇటీవలి కాలంలో అజిత్‌తో నాలుగు సినిమాలు తీశారు. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం. వీటిలో వివేగం తప్పించి మిగిలినవన్నీ బ్లాక్బస్టర్లే. తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో అన్నాత్తే తీశారు. తాజాగా ఇప్పుడు సూర్యతో జోడీ కట్టడంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో ‘కంగువా’పై భారీ అంచనాలు వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments