ఫారిన్లో పాట
- IndiaGlitz, [Friday,April 26 2019]
వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల తర్వాత సూర్య, కె.వి.ఆనంద్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'కాప్పాన్'. సూర్య ఇందులో పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇందులో ప్రధాని పాత్రలో నటిస్తుండగా కీలక పాత్రలో ఆర్య.. హీరోయిన్గా సయేషా సైగల్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్లో ఉంది. ప్రస్తుతం ఓ పాటను జావా ద్వీపంలో చిత్రీకరిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ రీసెంట్గా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు.