సూర్య సింగం 3 వాయిదా..!
Thursday, December 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న సింగం 3 పై అటు తమిళ్, ఇటు తెలుగులో ఊహించినట్టుగానే భారీ క్రేజ్ ఏర్పడింది. హరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.
అయితే..ఈనెల 9న ధృవ రిలీజ్ కారణంగా రెండు వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 23న సింగం 3 రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే...నోట్ల రద్దు వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనుకున్నారో ఏమో కానీ సింగం 3 చిత్రాన్ని వాయిదా వేసారు. ఈ విషయాన్ని హీరో సూర్య ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. క్రిస్మస్ కు సింగం 3 రావడం లేదు జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments