సూర్య సింగం 3 వాయిదా..!

  • IndiaGlitz, [Thursday,December 15 2016]

సూర్య హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.
అయితే..ఈనెల 9న ధృవ రిలీజ్ కార‌ణంగా రెండు వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో డిసెంబ‌ర్ 23న సింగం 3 రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే...నోట్ల ర‌ద్దు వ‌ల‌న ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారో తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌నుకున్నారో ఏమో కానీ సింగం 3 చిత్రాన్ని వాయిదా వేసారు. ఈ విష‌యాన్ని హీరో సూర్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. క్రిస్మ‌స్ కు సింగం 3 రావ‌డం లేదు జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందేమో చూడాలి.

More News

2016 గూగూల్ హీరో ఇత‌నే..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టీవ్ గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. అందుక‌నే అనుకుంట‌...ఫేస్ బుక్ లో హైయ్య‌స్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న సౌత్ స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసారు.

చైతుతో మూవీ ఎనౌన్స్ చేసిన రానా..!

అక్కినేని నాగ‌చైత‌న్యకు న‌ట‌న మీదే కాకుండా నిర్మాణ రంగం మీద కూడా ఆసక్తి ఉంది. అందుక‌నే నాగ‌చైత‌న్య ఒక లైలా కోసం చిత్ర నిర్మాణం అంతా త‌నే ద‌గ్గ‌రుండి చేసుకున్నాడు.

అందుకే చైతన్య సినిమా చేస్తున్నాను - రకుల్ ప్రీత్ సింగ్..!

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

మెగాస్టార్ ఖైదీ నెం 150 షూటింగ్ పూర్తి..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ చిత్రం  ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది.

సెన్సార్ కార్యక్రమాల్లో 'నేత్ర'!

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్,ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో