సూర్య సింగం 3 ఆడియో రిలీజ్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా నటిస్తున్నతాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న సింగం 3 పై అటు తమిళ్, ఇటు తెలుగులో ఊహించినట్టుగానే క్రేజ్ ఏర్పడింది. హరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన సింగం 3 టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
హరీష్ జైరాజ్ సంగీతం అందించిన సింగం 3 ఆడియోను భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షెన్ ఆడియోను ఈనెల 27న చెన్నైలో, తెలుగు వెర్షెన్ ఆడియోను డిసెంబర్ 5న హైదరాబాద్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments