సూర్య సింగం 3 రిలీజ్ డేట్ వచ్చేసింది..!

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

త‌మిళ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం సింగం 3. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కించారు. సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత శివ కుమార్ అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ..కుద‌ర‌లేదు.
ఆత‌ర్వాత ఈనెల 26న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు కోసం యువ‌త చేస్తున్న నిర‌స‌న‌లతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డం వ‌ల‌న సింగం 3 రిలీజ్ వాయిదా వేసారు. ఇక ఈ మూవీ రిలీజ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ఫిబ్ర‌వ‌రి 9న సింగం 3 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. మ‌రి...ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా సింగం 3 ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తుందని ఆశిద్దాం..!

More News

ర‌వితేజ ట‌చ్ చేసి చూడు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ట‌చ్ చేసి చూడు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ తెర‌కెక్కిస్తున్నారు. ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ కొత్త సినిమా టైటిల్ 'టచ్ చేసి చూడు'

'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు

వెన‌క్కి లాగే వ్యాఖ్య‌లు చేయ‌కండి - ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త‌కు పిలుపు నివ్వ‌టంతో ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు రెడీ అవుతున్నారు.

చిరు 151వ చిత్రం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 రికార్డ్ స్ధాయిలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం

గుంటూరోడు ఆడియోకు గెస్ట్ లు వీళ్లే..!

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ & బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ జంట‌గా  S.K. సత్య తెర‌కెక్కిస్తున్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గుంటూరోడు. ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై వ‌రుణ్ అట్లూరి నిర్మిస్తున్నారు.