నవంబర్ నుంచి సింగం3
- IndiaGlitz, [Saturday,September 12 2015]
సింగం3 షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకానుంది. యముడు, సింగం2 సినిమాలకు దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ముందు ఈ సినిమాకు అనిరుద్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ సూర్య తనకు దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కావాలని చెప్పడంతో దేవిశ్రీప్రసాద్నే ఇప్పుడు తీసుకున్నారు. తొలి రెండు భాగాల్లో ఉన్న అనుష్క మూడో భాగంలోనూ కంటిన్యూ అవుతోంది.
రెండో భాగంలో హన్సిక అదనంగా కనిపించింది. ఇప్పుడు మూడో భాగంలో శ్రుతిహాసన్ రానుంది. తమిళనాడులోని కారైక్కుడి, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, వైజాగ్, ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తారు. తొలుత ఇండియాలో షూటింగ్‌ను మొదలుపెడతారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పారిస్‌లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు.