ఆ కాఫీ అంటే సూర్యకి భయమట....
Send us your feedback to audioarticles@vaarta.com
నా చేతి కాఫీ అంటే హీరో సూర్య భయపడి పారిపోతాడు...అంటుంది సూర్య శ్రీమతి, హీరోయిన్ జ్యోతిక. ఒకప్పుడు వెండితెరపై జోడిగా కనిపించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. పెళ్ళైన తర్వాత హీరోయిన్ జ్యోతిక సినిమాల నుండి కాస్తా బ్రేక్ తీసుకుని మళ్ళీ నటించడం మొదలు పెట్టింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న జ్యోతిక నటించిన చిత్రం `మగలిర్ మట్టుమ్`. ఈ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న జ్యోతిక తననకు వంటరాదని పెళ్ళైన కొత్తలో ఒక దోశ మాత్రమే చేశాను. తర్వాత నాకు వంట చేసే అవకాశమే లేదు. నేను కాఫీ చేసిస్తాను అన్నా కూడా సూర్య భయంతో పరుగులు తీస్తారు అని చెప్పింది. తానీ స్థాయిలో ఉండటానికి భర్త సూర్య ప్రోత్సాహమే కారణమని కూడా జ్యోతిక చెబుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com