ఆకలి వేసినప్పుడు తినే సింహాన్ని అంటూ అదరగొట్టేస్తున్న ఎస్ 3 టీజర్..!

  • IndiaGlitz, [Monday,November 07 2016]

సూర్య‌, హ‌రి కాంబినేష‌న్లో సింగం సిరీస్ లో వ‌స్తున్న మూడ‌వ చిత్రం ఎస్ 3. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. సింగం, సింగం 2 చిత్రాలు స‌క్సెస్ సాధించ‌డంతో సింగం 3 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఎస్ 3 టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ఇందులో సూర్య.... త‌ప్పు చేస్తే... అది తెలిసి చేస్తే... వాడు దేవుడైనా వ‌దిలిపెట్ట‌ను ఇండియ‌న్...! అడ్డ‌వైన‌వి తినే న‌క్క‌ను కాదు ఆక‌లి వేసిన‌ప్పుడే తినే సింహాన్ని..! ఇప్పుడు పిచ్చ ఆక‌లి మీద ఉన్నాను ఏది దొరికినా వేటాడాలి అనే క‌సి మీద ఉన్నాను. అడ్డు వ‌చ్చిన వాడు ఎవడైనా తొక్కి తోలు తీస్తాను అంటూ చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియోన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ లో భారీత‌నం క‌నిపిస్తుంది. ఈ టీజ‌ర్ చూస్తుంటే....ఎస్ 3 అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే భారీ విజ‌యం సాధించేలా క‌నిపిస్తుంది. మ‌రి...ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో తెలియాలంటే...డిసెంబ‌ర్ 16 వ‌ర‌కు ఆగాల్సిందే..!

More News

'సాహసం శ్వాసగా సాగిపో' నిమాపై చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం - నిర్మాత మిర్యాల రవీందర్

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో. మిర్యా లసత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

సరదాగా ఒక శాంపిల్ చూస్తారేటి? అంటున్న కృష్ణ భగవాన్ !!

క్లైమాక్స్ ఫైట్ లో చిరు...

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటుంది.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు పవన్ రావడానికి కారణం ఇదే..!

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి...ఆతర్వాత అనుకోకుండా నటుడై..ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు కమెడియన్ సప్తగిరి.

సప్తగిరి ఎనర్జి చూస్తుంటే సప్తగిరి ఎక్స్ ప్రెస్ చూడాలి అనిపిస్తుంది ఖచ్చితంగా చూస్తాను - పవన్ కళ్యాణ్

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి తొలిసారి హీరోగా నటిస్తున్నచిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్.