సూర్య 'ఎస్-3' (సింగం 3) రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం`, సింగం2` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3` రూపొందుతోంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ విడుదల చేస్తారని వార్తలువినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఎస్3 క్రిస్మస్ రేసులో నిలబడింది. సినిమాను డిసెంబర్ 16న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. సూర్య సినిమా అంటేనే తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. తెలుగులోఎస్ 3 సినిమా నైజాం,ఆంద్ర డిస్ట్రిబ్యూషన్ తెలుగు హక్కులను మల్కాపురం శివకుమార్ దాదాపు 18 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com