మలేషియాకు సూర్య 'ఎస్3'

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా ఎస్‌3 (సింగం 3') రూపొందనుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు.

శృతిహాస‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న షెడ్యూల్‌లో సూర్య‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. రెండు రోజుల్లో వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి ఈ నెల 18 నుండి చెన్నైలో షూటింగ్ చేస్తారు. ఆగ‌స్టు 5నుండి ఫైన‌ల్ షెడ్యూల్‌ను మ‌లేషియాలో చిత్రీక‌రిస్తార‌ట‌. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ లో విడుద‌ల చేస్తార‌ట‌. తెలుగులో నైజాం, ఆంధ్ర హక్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ చేజిక్కించుకున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌.

More News

'ఇంకొకడు' ఆడియో, సినిమా రిలీజ్ డేట్

చియాన్ విక్రమ్ హీరోగా నయనతార,నిత్యామీనన్ హీరోయిన్స్ గా థమీన్స్ ఫిలింస్ బ్యానర్స్ పై శిబుథమీన్స్ నిర్మాతగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇంకొకడు'.

అమితాబ్ ఇంట్లో ప్రకాష్ రాజ్..

అమితాబ్ బచ్చన్ ని ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి కలిసారు.

ఆ జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయంటున్న శ్రియ‌

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న‌ అతి కొద్ది మంది తార‌ల్లో అందాల తార శ్రియ ఒక‌రు. ఇటీవ‌ల శ్రియ నాగార్జున ఊపిరి చిత్రంలో క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ డీటైల్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ర‌జ‌నీ రాక‌తో వెన‌క్కి వెళ్లిన వెంకీ..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. రంజిత్ తెర‌కెక్కించిన‌  సంచ‌ల‌న చిత్రం క‌బాలి ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.