సూర్య‌ S3 విడుద‌ల వాయిదా

  • IndiaGlitz, [Monday,January 23 2017]

సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించిన‌ చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26 న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా విడుద‌ల వాయిదా వేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకొవ‌టం జ‌రిగింది. డైర‌క్ట‌ర్ హ‌రి గారు , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కానీ ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఏప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేదిని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అన్నారు.

More News

జనవరి 26న 'గుంటూరోడు' ఆడియో విడుదల

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా,బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా,

కంట్రోల్ తప్పిన ప్రకాష్ రాజ్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీడియా ప్రతినిధిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.అందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే ...

ధృవ‌, శాత‌క‌ర్ణి భామ ఫ‌రా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అర‌వింద్ స్వామి ల‌వర్ పాత్ర పోషించిన న‌టి ఫ‌రా.

ఎ.పి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం యూత్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొన్ని రోజులుగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తెలుగు నేలంతా నన్నుకౌగలించుకున్నంత ఉద్వేగం - క్రిష్..!

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..?ఒక దేశాన్ని గెలిచిన గర్వం...తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం..