సూర్య ఎస్ 3 మోషన్ పోస్టర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

సూర్య - హ‌రి కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఎస్ 3. ఈ భారీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తుంది. సింగం, సింగం 2 చిత్రాలు విజ‌యాలు సాధించ‌డంతో ఎస్ 3 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసారు. ఇందులో సింహం 1, 2 నెంబ‌ర్స్ ను దాటుకుంటూ 3 నంబ‌ర్ కి రావడంతో స్టార్ట్ చేసారు. ఆత‌ర్వాత సింహం పాదాన్ని సూర్య షూగా చూపించారు.
గ్రాఫిక్స్ తో సూర్య‌ను చూపించి ఒక్క‌సారిగా ఫేస్ ను మాత్రం సీరియ‌స్ గా ఉన్న‌ట్టు చూపించారు. సూర్య ఫేస్ నుంచి మూడు సింహాలు వ‌చ్చిన‌ట్టు చూపించ‌డం బాగుంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా టీజ‌ర్ న‌వంబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.