'ఆకాశం నీ హద్దురా'... రిలీజ్‌ను వాయిదా వేసిన సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. అందుకనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఆయన లేటెస్ట్ మూవీ ‘శూరరైపోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య సినిమాలు ఎన్జీకే, బందోబస్త్(కాప్పాన్) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్లో `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది.
లాక్డౌన్ సమయంలో థియేటర్స్ మూతపడ్డాయి. అసలు థియేటర్స్ విషయంలో క్లారిటీ లేకపోయిన క్రమంలో హీరో సూర్య.. ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్‌లో విడుదల చేయడం లేదని సూర్య అధికారికంగా ప్రకటించారు. అయితే తదుపరి సినమా విడుదల ఎప్పుడనేది కూడా సూర్య అనౌన్స్ చేయలేదు. మరిప్పుడు థియేటర్స్ ఓపెన్ కావడంతో సూర్య తన నిర్ణయాన్నిఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments