డాక్టర్ గా సూర్య

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

'రాక్ష‌సుడు' త‌రువాత త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య నుంచి రానున్న త‌మిళ అనువాద చిత్రం 'మేము'. త‌మిళంలో 'ప‌సంగ 2' పేరుతో ఈ సినిమా రూపొందింది. తెలుగ‌మ్మాయి బిందు మాధ‌వి ఓ హీరోయిన్ అమ‌లా పాల్ మ‌రో నాయిక‌. ఈ సినిమా న‌వంబ‌ర్ 27న విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే.. 'మేము'లో సూర్య.. డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పాత్ర నిడివి త‌క్కువే అయినా.. అత‌ని పాత్ర సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం. ఇక సూర్య‌కి జోడీగా న‌టిస్తున్న అమ‌లా పాల్ టీచ‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుందట‌.

More News

లోఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ &డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్.

హీరోయిన్ గా హిట్స్ లేవు కానీ..

శ్రియ,అసిన్ వంటి పాపులర్ హీరోయిన్ల ఫీచర్స్ తో కనిపించే పూర్ణ..తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలనే మూటగట్టుకుంది.''సీమ టపాకాయ్''ఆమెకి తెలుగులో తొలి బ్రేక్ ఇస్తే..

శ్రీనువైట్ల పై గృహహింస కేసు

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్లపై అతని భార్య రూప వైట్ల గృహహింస కేసు నమోదు చేసింది.498ఎ సెక్షన్ కింద రూపావైట్ల, శ్రీనువైట్లపై గృహహింస కేసును నమోదు చేసింది.

జబర్థస్త్ స్టార్స్ తో సినిమా

ధనరాజ్-వేణు-తాగుబోతు రమేష్ - చమ్మక్ చంద్ర..ఈ నలుగురు ఇటు వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూనే..అటు బుల్లితెరపై చెలరేగిపోతున్నారు.

ట్విట్టర్ లో ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..

రేణుదేశాయ్..బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవ్వడం...పవన్ ను పెళ్లి చేసుకోవడం...విడిపోవడం తెలిసిన విషయమే.