పవన్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సూర్య

  • IndiaGlitz, [Friday,January 08 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఎస్.జె.సూర్య‌. ఇంత‌కీ..ఏ సినిమా సీక్వెల్ అంటారా..? ప‌వ‌న్, సూర్య క‌ల‌యిక‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ ఖుషీ. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసార‌ట సూర్య‌. మెచ్యూర్డ్ ల‌వ్ స్టోరీగా సీక్వెల్ ప్లాన్ చేయ‌డంతో క‌థ విని ప‌వ‌న్ సూర్య‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మిస్తుంద‌ట‌. అంతే కాదు ఈ చిత్రాన్ని ఈరోస్ తో క‌ల‌సి రేణు దేశాయ్ కో ప్రొడ్యూస్ చేస్తుందని స‌మాచారం. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ సూర్య‌, రేణుదేశాయ్ ఈ సినిమా గురించి చ‌ర్చించేందుకే క‌లిసార‌ట‌. ఈ క్రేజీ మూవీకి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్ని అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప‌వ‌న్ మే నుంచి ఖుషీ సీక్వెల్ స్టార్ట్ చేస్తార‌ని టాక్.