సూర్య తప్పుకున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'మనం' డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో తమిళ కథానాయకుడు సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. '24' పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారు. కథానాయకుడు సూర్యనే ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాని వేసవికి వాయిదా వేశారని కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో సంక్రాంతి బరిలోంచి సూర్య తప్పుకున్నాడని తమిళ సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments