హరితో మరోసారి సూర్య...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య, డైరెక్టర్ హరి అంటే సినీ ప్రేక్షకుడికి ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది సింగం ఫ్రాంఛైజీ. సింగం మూడు బాగాలు ప్రేక్షకాదరణ పొందినవే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ కలవనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయంపై డైరెక్టర్ హరి కూడా అవునన్నట్లుగానే చెప్పాడు. అయితే ప్రస్తుతం విక్రమ్, త్రిషలతో హరి రూపొందిస్తున్న సామి 2 సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత ఆలోచిస్తానని చెప్పాడు. సూర్య కూడా ఇప్పుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానా సెందకూట్టమ్ చేస్తున్నాడు, డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. తర్వాతే సూర్య, హరి కాంబినేసన్ చిత్రం సెట్స్‌లోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com