సింగిల్ ట్రైలర్‌తో 'ఎన్‌జీకే' రేంజ్ ‌చూపించేశారుగా..!

  • IndiaGlitz, [Monday,April 29 2019]

ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. సెల్వ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సూర్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి నటిస్తున్నారు. సోమవారం సాయత్రం ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెండు నిమిషాల నిడివి గల ఈ సింగిల్ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉంటుందో.. తన రేంజ్ ఏంటో సెల్వ రాఘువన్ చూపించేశారు.

ట్రైలర్ రివ్యూ..

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ కిరాక్ అనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ మొత్తంలో మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ అన్నీ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ట్రైలర్ ‘ఎన్‌జీకే’ అనే అరుపులతో రోడ్డుపై ఫస్ట్ షాట్ సూర్య భారీ కటౌట్‌తో ప్రారంభమవుతుంది. ‘ఓ చిన్న గుంపును వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా?’ అనే డైలాగ్‌తో అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ‘ఇలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకు అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది’ అనే డైలాగ్ జనాలను బాగా ఆకట్టుకుంది. ఈ రెండు డైలాగ్స్ సూర్య చెప్పినవి కాదు.. ఇప్పుడు సూర్య వంతు.. ‘రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకీ, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కు ఉంది’ అంటూ ఎన్‌జీకే ఆవేశంతో చేసిన ప్రసంగం జనాలను బాగా ఆకట్టుకుంది.

మరో హిట్ పక్కా..

కాగా.. ఇప్పటి వరకూ సెల్వ, యువన్ ఇద్దరూ కలిసి వర్క్ చేసిన సినిమాలు అన్నీ హిట్టయ్యాయి. ఇది కూడా కచ్చితంగా సూపర్‌ డూపర్ హిట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ట్రైలర్ చూసిన సూర్య అభిమానులు సూపర్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More News

కీలక నిర్ణయాలు తీసుకున్న 'మా'

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిన అనంతరం నరేష్ ప్యానెల్ ఫస్ట్ టైమ్ కీలక తీర్మానాలు చేసింది.

తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా క్షేమం

స్పైస్‌జెట్‌ విమానానికి సోమవారం సాయంత్రం తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ముగిసిన నాలుగో విడత పోలింగ్.. పొటెత్తిన ఓటర్లు

దేశ వ్యాప్తంగా సోమవారం జరిగిన నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది.

ప్ర‌భాస్‌కి టార్గెట్ వాళ్లే

గురి చూసి కొట్టాలేగానీ, మ‌న‌కు అంద‌ని ఫ‌లం ఉండ‌దు. ఈ విష‌యాన్ని బాగా న‌మ్మ‌తున్నారు ప్ర‌భాస్‌.

ఆరని ఇంటర్ మంటలు.. అట్టుడికిన తెలంగాణ

తెలంగాణ ఇంటర్ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలతో ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తూ నినాదాలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే.