సూర్య తదుపరి చిత్రం దర్శకుడు ఇతడే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య ప్రస్తుతం సింగం, సింగం 2 చిత్రాల సీక్వెల్ సింగం 3 లో నటిస్తున్నారు. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సింగం 3 చిత్రాన్నిఅక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...సూర్య తదుపరి చిత్రాన్ని రజనీకాంత్ తో కబాలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యువ దర్శకుడు రంజిత్ తో చేయనున్నారని చెన్నై సమాచారం.
రంజిత్ కబాలి చిత్రం తర్వాత స్టూడియో గ్రీన్ బ్యానర్ లో రెండు చిత్రాలు చేయడానికి అంగీకరించాడట. ఒక చిత్రం సూర్యతో, మరో చిత్రం కార్తీతో. ముందుగా రంజిత్ సూర్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com