సూర్య సినిమా షూటింగ్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అందుకే సూర్య యూనివర్సల్‌గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాల్లో నటిస్తుంటాడు. ఇప్పుడు సూర్య నటిస్తున్న చిత్ర `తానా సెంద కూట్టమ్`. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నేటితో చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోనుంది.
ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments