సూర్య సినిమా వాయిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య ఇప్పుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె(నందగోపాలకృష్ణ) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా విడుదల వాయిదాపడేలా కనపడుతుంది. నిజానికి ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనుకున్నారు.
కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం డైరెక్టర్ సెల్వరాఘవన్‌కి అనారోగ్యం కారణంగా షెడ్యూల్ వాయిదా పడిందట. దాని కారణంగా విడుదల కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. త్వరలోనే వివరాలు తెలస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com