రీమేక్‌లో సూర్య‌, కార్తి

  • IndiaGlitz, [Thursday,May 28 2020]

కొత్త కాన్సెప్ట్‌ల‌ను భాషా బేదం లేకుండాసినీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటార‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓటీటీ మాధ్య‌మాలు ఎక్కువైన నేటి రోజుల్లో సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాయి. రీసెంట్‌గా అలాంటి ఓ ప‌ర‌భాషా చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ద‌క్కించుకుంది. అలాగే త‌మిళంలో ఇద్ద‌రు హీరోలు క‌లిసి చేయ‌బోతున‌ట్లు సోష‌ల్ మీడియా స‌మాచారం. ఇంత‌కూ వారిద్ద‌రెవ‌రో కారు.. సూర్య‌, ఆయ‌న త‌మ్ముడు కార్తి.

సూర్య‌, కార్తిల‌కు ద‌క్షిణాదిన హీరోలుగా మంచి గుర్తింపే ఉంది. ఈ గుర్తింపుతో వీరిద్ద‌రితో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని చాలా మంది అనుకున్నారు. కానీ మంచి క‌థ కుద‌ర‌లేదు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రూ అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ని టాక్‌. అయితే వీరు క‌లిసి కోలీవుడ్‌లోనే న‌టించ‌బోతున్నార‌ట‌. మ‌ల‌యాళంలో బిజు మీన‌న్ న‌టించిన‌ పాత్ర‌లో సూర్య‌, పృథ్వీరాజ్ పాత్ర‌లో కార్తి న‌టించే అవ‌కాశాలున్నాయంటున్నారు. సూర్య హీరోగా న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో మోహ‌న్‌బాబు కూడా కీల‌క పాత్ర‌ను పోషించారు.

More News

సమంతపై అభ్యంతరకర పోస్ట్.. పూజా హెగ్దే అకౌంట్ హ్యాక్!

ఇదేంటి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ పూజా హెగ్దే.. సమంతపై అభ్యంతర పోస్ట్ చేసిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పోస్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ చేసింది మాత్రం పూజా హెగ్దే కాదట.

'లాస్ట్ పెగ్' యాక్షన్ టీజర్ విడుదల

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ చిత్రం. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది.

జగన్ కోసం తిరుమల కొండెక్కా.. కానీ మాట తప్పారు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్‌ పెద్దలు.. బాలయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదా!?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ తిరిగి ప్రారంభింపజేయాలని టాలీవుడ్ పెద్దలు నానా తంటాలే పడుతున్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి : సీఎం జగన్ కు నిర్మాతల మండలి లేఖ

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు,