వాయిదాల సూర్య‌

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా దీపావ‌ళికి విడుద‌ల చేద్దామ‌నుకున్నారు కానీ కుద‌ర‌లేదు. అయితే రీసెంట్‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు కూడా వినిపించాయి.

అయితే తాజా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని మార్చికి వాయిదా వేశార‌ట‌. త‌ర్వ‌లోనే మార్చి నెల‌లో ఏ తేదీకి విడుద‌ల చేస్తార‌నే దానిపై ఓ క్లారిటీ రానుంది. అస‌లు సూర్య త‌న సినిమాల‌ను వాయిదాల మీద వాయిదాలు వేసుకుని ఎందుకు రిలీజ్ చేసుకోవాల‌నుకుంటున్నారో అర్థం కాలేదంటూ అభిమానులు గుసగుస‌లాడుకుంటున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.