వై.ఎస్‌.ఆర్‌. బ‌యోపిక్‌లో సూర్య‌?

  • IndiaGlitz, [Monday,March 19 2018]

దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితకథను 2010లో 'భగీరథుడు' పేరుతో రూపొందించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా.. గిరి రెడ్డి స్వీయనిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అంతేగాకుండా.. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా వై.ఎస్.ఆర్.బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు చాలా సంవత్సరాల క్రితమే ప్రకటించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా వై.ఎస్.ఆర్. బ‌యోపిక్‌ నిర్మించనున్నట్టు నిర్మాతలు విజయ్ జల్ల, శశిదేవర్ రెడ్డి వెల్లడించారు.

వీరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వై.ఎస్.ఆర్.పాత్రకోసం మళయాళ నటుడు మమ్ముట్టిని.. వై.ఎస్.ఆర్.స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ పాత్రకోసం నయనతారను సంప్రదించినట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

ఇదిలా ఉంటే.. వై.ఎస్.ఆర్.తనయుడు వై.ఎస్.జగన్ పాత్రను ఎవరు పోషిస్తారనే ఆసక్తికరమైన విషయం టాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. అయితే.. ఈ పాత్రకోసం తమిళ నటుడు సూర్యను సంప్రదించిందట చిత్ర బృందం.

జగన్‌కు చెందిన భారతీ సిమెంట్ కంపెనీకి సూర్య బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించడంతో పాటు.. ఇటీవల 'గ్యాంగ్' సినిమా ప్రమోషన్‌కు రాజమండ్రి వచ్చిన సూర్య.. జగన్ పాదయాత్ర విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పడంతో.. సూర్య ఈ సినిమాకి ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More News

వ‌రుణ్‌తేజ్‌.. 14 రీల్స్ ప్ల‌స్.. సాగ‌ర చంద్ర క‌ల‌యిక‌లో కొత్త చిత్రం

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌,

కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు.

'ఉగ్రం' ఫస్ట్ లుక్ విడుదల

నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా,

మేనమామలతో నాగ చైతన్య

సొంత సంస్థ‌లో ‘మనం’, ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ చిత్రాలతో పాటు.. బయట నిర్మాతల ‘ఏ మాయ చేశావే’,

శర్వానంద్ సినిమా కోసం రూ.కోటి సెట్‌

‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులలో