వెంకీ సినిమాలో సూర్య‌...

  • IndiaGlitz, [Friday,August 17 2018]

విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఎఫ్ 2లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా..మ‌రోవైపు మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో 'వెంకీమామ‌'(విన‌ప‌డుతున్న పేరు) సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా త్రినాథ రావు న‌క్కిన చిత్రంలో కూడా వెంక‌టేశ్ న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో త‌మిళ హీరో సూర్య ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. అది కూడా పోలీస్ పాత్ర‌లో.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలను ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం సూర్య హీరోగా కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు.