అదే పాత్రలో హీరో సూర్య....
Send us your feedback to audioarticles@vaarta.com
సింగం 3 చిత్రంతో తెలుగు, తమిళంలో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16న థియేటర్స్‌లో సందడి చేయడానికి హీరో సూర్య రెడీ అయ్యారు. అలాగే ఇప్పుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో `తానా సెంద కూట్టమ్` అనే సినిమాను చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తానా సెంద కూట్టమ్ సెట్స్‌లో ఉండగానే సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో సూర్య ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనపడతున్నాడట. గతంలో సూర్య సికిందర్ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనపడ్డాడు. మళ్లీ సెల్వరాఘవన్ సూర్యను గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించడానికి రెడీ అవుతున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ఫై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌లోకి వెళ్లనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ఫై రీసెంట్గా విడుదలైన కాష్మోరా చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com