అదే పాత్రలో హీరో సూర్య....

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

సింగం 3 చిత్రంతో తెలుగు, త‌మిళంలో ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 16న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి హీరో సూర్య రెడీ అయ్యారు. అలాగే ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'తానా సెంద కూట్ట‌మ్' అనే సినిమాను చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. తానా సెంద కూట్ట‌మ్ సెట్స్‌లో ఉండ‌గానే సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో సూర్య ఓ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తున్నాడ‌ట‌. గతంలో సూర్య సికింద‌ర్ సినిమాలో గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. మ‌ళ్లీ సెల్వ‌రాఘ‌వ‌న్ సూర్య‌ను గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వ‌రలోనే సెట్స్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ఫై రీసెంట్‌గా విడుద‌లైన కాష్మోరా చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది.