సంక్రాంతి రేసులో సూర్య..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత నటిస్తుంది. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పసంగ 2 అనే చిత్రాన్నికూడా సూర్య నటిస్తూ..నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 24 మూవీ ప్రస్తుతం పూణెలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. నవంబర్ ఫస్ట్ వీక్ కి షూటింగ్ పూర్తవుతుంది. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న 24 మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com