పోలెండ్ వెళుతున్నసూర్య...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

తమిళ స్టార్ సూర్య హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 24' సినిమా రూపొందుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా ముంబాయ్ లో లాస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఓ వారం పాటు జరిగే షూటింగ్ తో టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుంది.

నెక్స్ ట్ వీక్ లో ఈ యూనిట్ పోలెండ్ వెళుతుందట. అక్కడ 20 రోజుల పాటు జరిగే షూటింగ్ లో రెండు సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తోఈ చిత్రం తెరకెక్కుతోందట. సినిమా లార్జ్ స్కేల్ తో ఉండటం, ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో యూనిట్ ఉందట.