మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సూర్య‌

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

గ‌జిని చిత్రంతో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన‌ చిత్రం తానే సేరంద కూట్ట‌మ్‌. ఈ సినిమాని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కి తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జనవరి 12న త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని త‌మిళ నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే సందీప్ కిషన్ తో మానగరం'చేసి విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేష్ కనగారాజ్ తో సూర్య ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నార‌ని తెలిసింది. దీనికంటే ముందు సెల్వ రాఘవన్ కాంబినేష‌న్‌లో సినిమా చేయబోతున్నారు సూర్య‌. ప్రస్తుతం 'గ్యాంగ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

More News

చరణ్ హీరోయిన్ గా...

మజ్ను చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

యాక్షన్ ప్లాన్ లో పూరి....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమా చేస్తోన్న సంగతి తెలిసింది. పూరి దర్శకత్వంతో పాటు స్వీయ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. `మెహబూబా` పేరుతో రూపొందుతోంది.

రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం.

తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది - రమ్యకృష్ణ

'బాహుబలి'లో శివగామి క్యారెక్టర్‌లో అత్యద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా 'మాతంగి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ 'మాతంగి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తు

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి.. పొలిటిక‌ల్ మూవీ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయో ప‌్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు.