నవల ఆధారంగా హీరో సూర్య సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. అందుకనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య సినిమాలు ఎన్జీకే, బందోబస్త్(కాప్పాన్) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్లో `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో సూర్య. ఈ సినిమా తర్వాత అసురన్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలోఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి `వాడివాసల్` అనే టైటిల్ను ఖరారు చేశారు. తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాసల్ అంటారు. వివరాల ప్రకారం సీఎస్.చెల్లప్ప అనే రచయిత రాసిన నవల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. దానికి సంబంధించిన హక్కులను కూడా సూర్య అండ్ టీమ్ దక్కించుకుందట. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అసురన్ వంటి రస్టిక్ చిత్రాన్ని తెరకెక్కించిన వెట్రిమారన్.. సూర్య సినిమాను కూడా రస్టిక్గానే తెరకెక్కిస్తాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments