టీటీడీపై హీరో సూర్య తండ్రి సంచలన ఆరోపణలు.. కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ అగ్ర నటుడు సూర్య తండ్రి శివకుమార్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షాకిచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధానంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో డబ్బులున్నవారికే దర్శనాలు కల్పిస్తారని.. అంతేకాదు గెస్ట్‌హౌస్‌లు వారికే ఇస్తారని శివకుమార్ ఆరోపించారు. అంతటితో ఆగని ఆయన.. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని కూడా వ్యాఖ్యానించారు. అసలు టీటీడీ లాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలి..? అని శివకుమార్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ శనివారం సాయంత్రం నోటీసులు జారీ చేసింది.
ఇలా టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారి భరతం పట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో మొత్తం 8మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో హీరో సూర్య తండ్రి శివకుమార్ కూడా ఉన్నారు. ఈ 8 మంది తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తిరుమలకు వెళ్లొద్దంటూ ఆరోపణలు చేసినవారే. కాగా తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారంపై ఇంతవరకూ సూర్య కానీ.. శివకుమార్ కానీ స్పందించలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments