డబ్బింగ్ చెబుతున్న సూర్య
- IndiaGlitz, [Saturday,March 23 2019]
సూర్య నందగోపాల కృష్ణుడిగా వేసవిలో మెప్పించబోతున్నాడు. అందుకోసం డబ్బింగ్ స్టార్ట్ చేసేశాడు కూడా. వివరాల్లోకెళ్తే.. తెలుగు, తమిళంలో హీరోగా మంచి గుర్తింపుతో పాటు తన సినిమాలకు మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో సూర్య ఒకడు.
ఈయనకున్న క్రేజ్ కారణంగా ఆయన నటించిన సినిమాలు రెండు భాషల్లోనూ సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇప్పుడూ అలాగే సూర్య నటించిన 'ఎన్.జి.కె(నందగోపాలకృష్ణ)' కూడా తెలుగులో విడుదల కానుంది. రీసెంట్గా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.
టీజర్ చూస్తుంటే సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ఈ సినిమాను మే లేదా జూన్‌లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
అందులో భాగంగా సూర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరో పక్క సూక్య కాప్పాన్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.