సూర్య డబ్బింగ్ చెప్పాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాతో వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. విఘ్నేశ్ శివన్ దర్శకుడు. తమిళంలో తెరకెక్కిన 'తానా సెంద కూట్టమ్' సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుదల చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమా టీజర్ విడుదలైంది. సాధారణంగా సూర్యకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెబుతాడు. కానీ గ్యాంగ్ టీజర్ చూస్తుంటే..సూర్యకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పినట్టు లేదు.
సూర్యనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు కనపడుతుంది. కానీ సూర్యనే డబ్బింగ్ చెప్పాడా లేక మరేవరైనా చెప్పారా అనే దానిపై ఎలాంటి అధికారక సమాచారం లేదు. ఇదే కనుక నిజమైతే సూర్య డబ్బింగ్ చెప్పుకున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments