మహేష్ నో చెప్పిన కథను ఓకె చేసిన సూర్య..

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ నో చెప్పిన క‌థ‌ను హీరో సూర్య ఓకె చేసాడట‌. ఇంత‌కీ అది ఏ సినిమా అంటారా..? సూర్య ప్ర‌స్తుతం న‌టిస్తున్న 24. ఈ చిత్రాన్నిమ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ అండ్ స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర క‌థ‌ను ముందుగా విక్ర‌మ్ కుమార్ మ‌హేష్ కి చెప్పాడ‌ట‌. క‌థ విన్న మ‌హేష్ ఫ‌స్టాఫ్ బాగుంది. సెకండాఫ్ న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌. అప్పుడు విక్ర‌మ్ కుమార్ సూర్య ని క‌ల‌వ‌డం..క‌థ చెప్ప‌డం, సూర్య ఓకె చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ఆవిధంగా 24 ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభిన‌యం చేసాడ‌ట‌. ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్నిఅందిస్తున్న‌ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.