సూర్య మళ్లీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన పాత్రలు, సినిమాలు చేయడానికి ముందుండే హీరోల్లో సూర్య ఒకరు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంటుంది. రీసెంట్గా సైంటిఫిక్ థ్రిల్లర్ 24తో మంచి విజయాన్ని సాధించిన హీరో సూర్య ఇప్పుడు సింగం 3 సినిమాను డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సింగం 3 సీక్వెల్ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సూర్య ప్రస్తుతం నేను రౌడీనే ఫేమ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న తానా సెంద కూట్టమ్ సినిమాలో నటిస్తున్నాడు. సింగం 3 సినిమా కోసం కసరత్తుల గట్రా చేసి వెయిట్ పెంచిన సూర్యను దర్శకుడు విఘ్నేష్ శివన్ తన సినిమాలోని పాత్ర కోసం పది కిలోలు వెయిట్ తగ్గమని సూచించాడట. దానికి సూర్య సరేనన్నాడట. ముఖ్య విషయమేమంటే ఈ వెయిట్ లాస్ కోసం సూర్య జిమ్‌కు వెళ్లడం లేదట. ఫుడ్ స్టయిల్ మార్చి వెయిట్ తగ్గాలనుకుంటున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments