సూర్య కొత్త మైలురాయి...

  • IndiaGlitz, [Sunday,July 03 2016]

సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ట్విట్ట‌ర్ లో ప‌దిల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ చేరుకోవ‌డంతో హీరో సూర్య కొత్త మైలురాయిని చేరుకున్నాడు. మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ అంటే పెద్ద సంఖ్యే మ‌రి.

ఈ నెంబ‌ర్ ను చేరుకోవ‌డానికి సూర్య ఏడాది కాలం ప‌ట్టింది. తెలుగు, త‌మిళంలో సూర్య సినిమాల‌కు ప్రత్యేక‌మైన క్రేజ్ ఉంది. త‌న సినిమాల‌తో పాటు తాను అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు గురించి విష‌యాల‌ను ట్విట్ట‌ర్ ద్వారానే తెలియ‌జేస్తుంటారు. సూర్య రికార్డు పట్ల ఆయ‌న అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సూర్య ఎస్‌-3(సింగం సీక్వెల్ మూడో పార్ట్‌) చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న‌ అనుష్క‌తో పాటు శృతిహాస‌న్ న‌టిస్తుంది.

More News

నిర్మ‌లా కాన్వెంట్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రం నిర్మలా కాన్వెంట్.

చైతు హీరోయిన్తో విశాల్....

నాగచైతన్యతో `సాహసం శ్వాసగా సాగిపో`చిత్రంలో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ తమిళ వెర్షన్ లో శింబు సరసననటించింది.

క‌రీనా కోరిక నిజ‌మైంది..

బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ త‌ల్లి కాబోతుంది. క‌రీనా మూడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి...అంటూ గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఈ వార్త‌ల పై క‌రీనా స్పందిస్తూ

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న'అపార్ట్‌మెంట్‌'

శ్రీ క్రియేటివ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిఖిత ప్రధానపాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'అపార్ట్‌మెంట్‌'. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెల్ఫీ రాజా విడుద‌ల తేదీ ఖ‌రారు

అల్ల‌రి న‌రేష్ న‌టించిన‌ తాజా చిత్రం సెల్ఫీ రాజా. ఈ చిత్రాన్ని సిద్ధు ఫ్ర‌మ్ సికాకుళం ఫేం జి.ఈశ్వ‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై చ‌ల‌సాని రామ బ్ర‌హ్మాం చౌద‌రి నిర్మించగా... ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై లిమిటెడ్ బ్యాన‌ర్  పై రామ బ్ర‌హ్మాం సుంక‌ర స‌మ‌ర్పిస్తున్నారు.