సూర్య కొత్త మైలురాయి...
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్ లో పదిలక్షల ఫాలోవర్స్ చేరుకోవడంతో హీరో సూర్య కొత్త మైలురాయిని చేరుకున్నాడు. మిలియన్ ఫాలోవర్స్ అంటే పెద్ద సంఖ్యే మరి.
ఈ నెంబర్ ను చేరుకోవడానికి సూర్య ఏడాది కాలం పట్టింది. తెలుగు, తమిళంలో సూర్య సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తన సినిమాలతో పాటు తాను అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి విషయాలను ట్విట్టర్ ద్వారానే తెలియజేస్తుంటారు. సూర్య రికార్డు పట్ల ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఎస్-3(సింగం సీక్వెల్ మూడో పార్ట్) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్కతో పాటు శృతిహాసన్ నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com