డిస్ట్రిబ్యూటర్స్‌కు సూర్య కౌంటర్!!
- IndiaGlitz, [Sunday,May 17 2020]
కరోనా ప్రభావంతో ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో గొడవలు తలెత్తాయి. ముఖ్యంగా హీరో సూర్య డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ నుండి ఓ రేంజ్ బెదిరింపులనే ఎదుర్కొన్నారు. సూర్య నిర్మాతగా మారి ఆయన సతీమణి జ్యోతిక ప్రధాన పాత్రధారిగా నటించిన పొన్‌మగళ్ వందాల్ సినిమాను సూర్య ఓటీటీలో విడుదల చేయాలని అనుకోగానే థియేటర్స్ సంఘాలు సూర్యను బెదిరించాయి. సూర్య సినిమాలను థియేటర్స్‌లో ఇకపై విడుదల చేయబోమని ప్రకటించాయి. అయితే సూర్య తన నిర్ణయాన్ని ఏమాత్రం వెనక్కి తీసుకోలేదు. పొన్‌మగళ్ వందాల్ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.
దీనిపై హీరో సూర్య రీసెంట్‌గా వివరణ ఇచ్చుకున్నారు. తనకు రూ.70 కోట్లు అప్పు ఉందని అలాంటి సమయంలో తన అప్పును మరింత పెంచుకోలేనని అందుకనే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నానని ఆయన తెలిపారు. తన సినిమాలు ప్లాప్ అయినప్పుడు తనకెవరూ హెల్ప్ చేయలేదని సూర్య అన్నారు. తన వ్యాపారం తాను చేసుకుంటున్నానని, సినిమా పెద్ద హిట్టై ఓవర్‌ఫ్లో అయినప్పుడు ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ తనను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని సూర్య అన్నారు. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఓటీటీలోనే ఇకపై విడుదల చేస్తానని, తన బడ్జెట్ పరిధి అందులోనే ఉంటుందని ఆయన అన్నారు.