లండన్ షెడ్యూల్ పూర్తి చేసిన సూర్య...
Send us your feedback to audioarticles@vaarta.com
వీడొక్కడే, బ్రదర్స్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్ లాల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇటీవలే లండన్‌లో చిత్రీకరణ ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. లండన్ పార్ట్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని.. ఎన్.జి.కె సినిమాను పూర్తి చేసేస్తాడట సూర్య. ఎందుకంటే 'ఎన్.జి.కె' సినిమా దీపావళికి విడుదల కావాల్సి ఉంది.
తర్వాత పూర్తి ఫోకస్‌ను కె.వి.ఆనంద్ సినిమాపై పెట్టనున్నాడట సూర్య. ఈ చిత్రంలో మోహన్‌లాల్, అల్లు శిరీశ్, ఆర్య తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com