సూర్య.. రెండేళ్ళు బిజీ
Send us your feedback to audioarticles@vaarta.com
'గజిని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ కథానాయకుడు సూర్య. ఆ తరువాత పలు వైవిధ్యమైన పాత్రలతో తెలుగువారికి మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. రెండేళ్ళ పాటు ఆయన డైరీ ఖాళీ లేదనే చెప్పాలి.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సూర్య.. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్జీకె’ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడిగా సూర్యకిది 36వ చిత్రం. ఈ చిత్రం తర్వాత సూర్య తన 37వ సినిమాని కె.వి.ఆనంద్ డైరెక్షన్‌లో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ లాంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై ఇప్పటినుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాగా.. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23 నుంచి లండన్‌లో ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. సూర్య తన 38వ చిత్రాన్ని 'గురు' ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో చేయనున్నారు. అనంతరం తనకి బాగా కలిసొచ్చిన దర్శకుడు హరి (‘సింగం’ సిరీస్ డైరెక్టర్) తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. సూర్య 39వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ‘సింగం’ సిరీస్‌కి కొనసాగింపుగా కాకుండా మరో కొత్త సబ్జెక్టుతో రూపొందించబోతున్నారని సమాచారం. ఇలా వరుస చిత్రాలు చేస్తూ.. రాబోయే రెండేళ్లు బిజీ హీరోగా మారనున్నారు సూర్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com