అంచనాలు పెంచిన సూర్య బందోబస్త్' టీజర్
Monday, July 8, 2019 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తీవ్రవాదం వలన భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు... రైతులు, నది జలాల సమస్యలు... ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్స్ నేపథ్యంలో రూపొందిన డిఫరెంట్ అండ్ న్యూ ఏజ్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ 'బందోబస్త్'. 'గజిని', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న చిత్రమిది. ప్రధాని పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్నారు. ఆర్య, సాయేషా సైగల్ ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' తర్వాత లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.
మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా శనివారం 'బందోబస్త్' టీజర్‌ను విడుదల చేశారు. పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకుని వైవిధ్యమైన నటన కనబరిచే సూర్య, ఈ సినిమాలో కమాండోగా, ముస్లిమ్ వ్యక్తి కథిర్‌గా, సుభాష్‌గా డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. రాజకీయం, జర్నలిజం, నక్సలిజం నేపథ్యంలో 'రంగం' వంటి సూపర్‌హిట్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అందించిన దర్శకుడు కె.వి. ఆనంద్, అంతకు మించి ఉత్కంఠ కలిగించే అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ 'బందోబస్త్' రూపొందించారని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్ జయరాజ్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది. ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కానుంది.
సూర్య, మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: వనమాలి, చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హారీస్ జయరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments