పొలిటిషియన్‌గా సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాలా నిలిచిన కథానాయకుడు సూర్య. తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, మార్కెట్‌ను సొంతం చేసుకున్న సూర్య.. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సింహ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. సందేశాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. అలాగే ఏ ఒక్కర్నో టార్గెట్ చేసుకున్నట్లుగా కాకుండా.. ఆలోచింపజేసేలా మాత్రమే ఈ పాత్ర ఉంటుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments