పవర్‌ఫుల్ టైటిల్‌తో సూర్య 39...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య తన 38వ చిత్రం శూరరై పోట్రుని ఈ ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుజరుగుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోపు సూర్య తన 39వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. డైరెక్టర్ హరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అరువా’ అంటే కత్తి అనే అర్థం వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆరో సినిమా ఇది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిజానికి సూర్య 39వ సినిమాను డైరెక్టర్ శివ తెరకెక్కించాల్సింది. అయితే రజినీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సూర్యతో సినిమాను పెండింగ్‌లో పెట్టాడు డైరెక్టర్ శివ. ఈ గ్యాప్‌లో సూర్య తన 39వ సినిమాను హరితో తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రంలో నటంచబోయే హీరోయిన్ సహా ఇతర నటీనటుల వివరాలను తెలియజేయనున్నారు. డి.ఇమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments