బాలీవుడ్ లో సూర్య 24..
Thursday, March 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24. ఈ చిత్రాన్ని హీరో సూర్య నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు.
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే 24 మూవీని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రేజీ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 24 మూవీని నిర్మిస్తున్న హీరో సూర్య స్వయంగా బాలీవుడ్ లో ఈ మూవీ రీమేక్ చేయనున్నట్టు సమాచారం. 24 బాలీవుడ్ రీమేక్ ని సల్మాన్ ఖాన్ లేదా హృతిక్ రోషన్ తో చేయాలనుకుంటున్నారట. అయితే సూర్య సల్మాన్ ఖాన్, లేదా హృతిక్ రోషన్ ని సంప్రదించారా లేదా అనేది తెలియాల్సివుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments