సూర్య ఈసారైనా హిట్ కొడతాడా?

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

తమిళ హీరో సూర్య ఇప్పుడు 24 సినిమా రిలీజ్ లో బిజీగా ఉన్నాడు. 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్య హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మనం తర్వాత విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కారణంగా ఈ సినిమాను మే నెలలో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

అయితే గతంలో సూర్య సినిమాలు చూస్తే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ, వీడొక్కడే, రాక్షసుడు చిత్రాలు అన్నీ మే నెలలోనే రిలీజ్ అయ్యాయి. వీటిలో వీడొక్కడే చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే యువ, రాక్షసుడు ప్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. మరి ఈసారి 24 చిత్రంతో అయినా సూర్య హిట్ కొడతాడెమో చూడాలి.