సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

  • IndiaGlitz, [Monday,February 08 2016]

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన 24 మూవీ ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా 24 టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ డేట్ అయిన 24వ తారీఖున 24 టీజ‌ర్ లాంఛ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నమైన క‌ధాంశాల‌తో సినిమాలు రూపొందించే విక్ర‌మ్ కుమార్ 24 మూవీని కూడా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్నారు.